Tribute | వివేకానందునికి నివాళి

Tribute | వివేకానందునికి నివాళి

Tribute | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణం బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఆయ‌న విగ్రహానికి వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ రోజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాతగా, తన అపార మేధస్సుతో భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు అని కొనియాడారు. యువత ఆయన బోధనలు, ఆదర్శాలను అనుసరించి సమాజ నిర్మాణంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply