Vivekananda | బోధనలు మార్గదర్శకం

Vivekananda | బోధనలు మార్గదర్శకం
- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
Vivekananda | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించడంలో స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శకమని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. ఇవాళ జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువత లక్ష్యసాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని, సమాజ సేవను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివేకానందుని ఆలోచనలు నేటి యువతకు దిశానిర్దేశమని, విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాల ద్వారా సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి రఘు, ఆర్డీఓ హరికృష్ణ, యువజన సర్వీసులు శాఖ సిబ్బంది సాగర్, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
