మెదక్ బ్యూరో : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మొదటి పేపర్ పరీక్ష సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కాలేజ్, న్యూ జనరేషన్ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ఏ పరీక్ష కేంద్రాల్లో ఎంతమంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సమయానికి పరీక్ష కేంద్రానికి పరీక్ష క్వశ్చన్ పేపర్లు చేరుకున్నాయా, పరీక్ష కేంద్రాల్లో ఇంకేమైనా వసతులు అవసరమో తెలుసుకొని విద్యార్థులు పరీక్ష ప్రశాంతంగా, సౌకర్యవంతంగా రాసేందుకు గాలి, వెలుతురు సరిగా ఉండేలా చూడాలన్నారు.
అలాగే అంద దివ్యాంగులు ప్రత్యేక సహాయకుల ద్వారా పరీక్ష రాసేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని పరీక్ష కేంద్రాల చీప్ సూపరింటెండెంట్లకు సూచించారు. ఎండలు అధికంగా ఉన్నందున ప్రతి పరీక్ష కేంద్రం వద్ద చల్లని తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవీందర్ రెడ్డి ఉన్నారు.