Chityal | ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలి : మేడి హరికృష్ణ

Chityal | ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలి : మేడి హరికృష్ణ

Chityal | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ స్టేజి వద్ద‌ రహదారిపై ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ పోలీసు అధికారులను, హైవే అధికారులను ఈ రోజు తన ఫోన్ ద్వారా తెలియజేశారు. సంక్రాంతి సందర్భంగా హైవే పై వాహనాలు రద్దీతో గ్రామస్తులు, ప్రయాణికులు రోడ్డును దాటేoదుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాహనాలు వేగంగా వస్తున్నాయని ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు.

Chityal

Leave a Reply