Lakshmanachanda | కేసులు నమోదు, రిమాండ్‌కు తరలింపు

Lakshmanachanda | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : గత శుక్రవారం పొన్కల్ బీటు పరిధిలో విద్యుత్ వైర్ ల సహాయంతో చుక్కల దుప్పిని వేటాడి మామడ మండలంలోని నల్దుర్తి-పొన్కల్, లక్ష్మణ చందా మండలంలోని చింతల్ చాంద ప్రాంతంలో అమ్ముతుండగా పట్టుబడిన నల్దుర్తి నివాసి అయిన ఏ 1 మంద భీమేష్, చామన్ పల్లి నివాసి అయిన ఏ2 కొర్రి గంగాధర్ లను అరెస్టు చేసి శనివారం రోజున నిర్మల్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు టి.శ్రీనివాసరావు తెలిపారు.

నిందితులలో ఒకరైన (A1)కి 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించి, నిర్మల్‌లోని ప్రత్యేక సబ్ జైలుకు పంపగా, మరో నిందితుడైన (A2)ని జేఎఫ్‌ఎంసీ నిర్మల్ రూ. 10,000/- పూచీకత్తుపై విడుదల చేశారు. అటవీ జంతులను వేటాడినా, అటవీ జంతువుల మాంసం విక్రయించి సేవించినా కూడా వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, తెలంగాణ అటవీ చట్టం1967ల ప్రకారం కఠినమైన శిక్షలు విధించబడతాయని దిమ్మదుర్తి అటవీ క్షేత్రాధికారి టి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి. శ్రీనివాస్ ఎఫ్ ఎస్ ఓ, రాజు ఎఫ్ బి ఓ, లక్ష్మీనరసయ్య ఎఫ్ బి ఓ, అనిమల్ ట్రాకర్లు పాల్గొన్నారు.

Leave a Reply