Womens | ర‌ద్దీ రోడ్డుపై ముగ్గుల పోటీ

Womens | ర‌ద్దీ రోడ్డుపై ముగ్గుల పోటీ

  • దారిని బ్లాక్ చేసి మరీ నిర్వ‌హ‌ణ
  • ఇబ్బందులు ప‌డిన ప్రజలు, వాహనదారులు
  • ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తీరుపై స్థానికుల ఫైర్‌

Womens | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం నాయుడు బట్టి సెంటర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ముగ్గుల పోటీల నిర్వ‌హ‌ణ‌ను నగరవాసులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముగ్గుల పోటీ నిర్వహణ కోసం నాయుడు బట్టి సెంటర్ ఎస్బీఐ బ్యాంకు వద్ద నుంచి నిర్మల పాఠశాల వరకు రోడ్డును పోలీస్ బారిగేడ్లు పెట్టి మరీ బ్లాక్ చేశారు. ఈ రోడ్డులో వాహనాలను అనుమతించడం లేదు. రోడ్డును బ్లాక్ చేయడానికి ఎవరు అనుమతించారని కొంతమంది నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

రోడ్డును అనుమతులు లేకుండా బ్లాక్ చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ముగ్గుల పోటీలను మైదానాలలో నిర్వహించకుండా రోడ్డుపై నిర్వహించటం పై నగరవాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు జాయింట్ కలెక్టర్, డీఆర్వో నివాసం ఎదురుగా ఉన్న రోడ్లను బ్లాక్ చేయడంపై సిటిజన్లు మండిపడుతున్నారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే మార్గం ఇది కూడా ఒకటి. అత్యవసర పరిస్థితుల్లో నాయుడు బట్టి సెంటర్ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే అంబులెన్స్లు దారి మళ్లించుకోవాల్సిందే. సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీ ప్రజలకు ఇబ్బంది లేకుండా మైదానాలలో నిర్వహించుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply