MLA | సంక్రాంతి సంబరాలు..

MLA | సంక్రాంతి సంబరాలు..

  • డూడూ బసవన్నలు, హరిదాసుల కీర్తనలు, విద్యార్థుల కోలాటాలు
  • శ్రీవిద్య హై స్కూల్‌లో ఉత్సవాలు
  • హాజ‌రైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

MLA | నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ పట్టణంలోని శ్రీవిద్య హైస్కూల్‌లో ఈ రోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. డూడూ బసవన్నల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, విద్యార్థిని, విద్యార్థుల కోలాటాలతో పాఠ‌శాల ఆవ‌ర‌ణ అంతా పండుగ వాతావరణాన్ని త‌ల‌పించింది. విద్యార్థులు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణలో చేసిన‌ ప్రదర్శనలు అలరించారు.

ఈ వేడుకల్లో శ్రీవిద్య హైస్కూల్ యాజమాన్యంతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. పండుగల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు తదుపరి తరాలకు చేరాలన్నదే ఇటువంటి కార్యక్రమాల ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి,వార్డు కౌన్సిలర్లు, కూటమి నేతలు, స్కూల్ యాజమాన్యం, తల్లితండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply