4th day | సహకార సంఘాల ఉద్యోగుల ధర్నా

4th day | నాగాయలంక – ఆంధ్రప్రభ : సహకార సంఘాల్లో పనిచేసే సిబ్బందికి జీవో నెం.36 అమలు చేయాలని, పెండింగులో వున్న 2019 సంవత్సరం నుంచి 2024 వరకు పీ ఆర్ సీ లను వెంటనే ఇప్పించాలని కోరుతూ 4వ రోజు ఇవాళ‌ స్థానిక కే డీసీసీ బాంక్ కార్యాలయం ఎదుట నాగాయలంక, బర్రంకుల, పెదకమ్మవారి పాలెం, ఎదురుమొండి, పర్రచివర, ఏటిమొగ సంఘాల ఉద్యోగులు పాల్గొని ధర్నా చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు వలే వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తరువాత సహకార సంఘాలలో జాయిన్ అయిన ప్రతి ఉద్యోగిని ప‌ర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రామాంజనేయులు, శ్రీనివాసరావు, జీవీ భాస్కర రావు, కె.రాజేష్, కె.ఆనంద బాబు నేతృత్వం వహించారు.

Leave a Reply