షూటింగ్‌‌లో గాయపడ్డ హీరో కార్తీ !

తమిళ స్టార్ హీరో కార్తీ ‘సర్దార్-2’ షూటింగ్‌లో గాయపడ్డారు. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో స్పై – యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కతుఉతన్న ఈ సినిమాలో కార్తీ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. కాగా, మైసూర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా కార్తీ కాలికి గాయమైంది.

కార్తీని వెంటనే చిత్ర బృందం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత 2 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించగా.. కార్తీ తిరిగి చెన్నై వెళ్లిపోయాడు. దీంతో ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *