Rs. 1.50 lakh | నందిగామలో ఏసీబీ మెరుపు దాడి

Rs. 1.50 lakh | నందిగామలో ఏసీబీ మెరుపు దాడి
- లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ ఎంపీడీవో సహా ముగ్గురు అధికారులు
Rs. 1.50 lakh | నందిగామ, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. భవన నిర్మాణ(Building construction) అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసిన ఎంపీడీవో, ఎంపీఓ, గ్రామ కార్యదర్శిని ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈదులపల్లి గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో నూతన భవన నిర్మాణ అనుమతి కోసం బాధితుడిని అధికారులు ఆశ్రయించారు. ఈ క్రమంలో నందిగామ మండల ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య కలిసి సదరు బాధితుడి నుండి తొలుత ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు.
చివరకు 2.50 లక్షల రూపాయలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఇప్పటికే అడ్వాన్స్‌గా రూ.1.50 లక్షల(Rs. 1.50 lakh) రూపాయలను నిందితులకు అందజేశాడు. మిగిలిన ఒక లక్ష రూపాయలను ఈ రోజు చెల్లిస్తుండగా, ముందస్తు సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం మెరుపు దాడి నిర్వహించింది. నగదు తీసుకుంటున్న సమయంలో ముగ్గురు అధికారులను అధికారులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

ఎంపీడీవో సుమతి 2024, ఫిబ్రవరి 14న ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లు తిరక్కుండానే అవినీతి ఆరోపణలతో పట్టుబడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఏసీబీ బృందం కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. నిందితులపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించనున్నట్లు సమాచారం.
