Munugode| తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం

Munugode| తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం

Munugode| మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని మిషన్ భగీరథ డీఈఈ సంధ్య అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకోండి గ్రామంలో ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులకు గురవుతున్నారని ఆ గ్రామ సర్పంచ్ పోలగోని విజయలక్ష్మి, సైదులు గౌడ్ మిషన్ భగీరథ డీఈఈ కి విజ్ఞప్తి చేయగా, ఈరోజు ఆమె ఏఈఈ సాయి చరణ్ తో కలిసి ఆ గ్రామాన్ని సందర్శించి మిషన్ భగీరథ ట్యాంకులను పరిశీలించారు.

మిషన్ భగీరథ స్కీం ఏర్పాటు చేసిన రోజు నుండి ఇప్పటివరకు 50శాతం తాగునీరు కూడా రాలేదని అధికారులు నిర్ధారణ చేసుకున్నారు. వేసవికాలం నాటికి గ్రామానికి సరిపడా తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జానకి రాములు, ఉపసర్పంచ్ కట్టకుంట్ల మల్లేష్, వార్డ్ మెంబర్లు బోయపల్లి స్వాతి స్వామి గౌడ్, చందపాక రామకృష్ణ, నకరికంటి శ్రీను, బాసోజు ముత్యాలు, వాటర్ మాన్ లింగస్వామి, నరసింహ, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply