transfer | కోట శ్రీహరి రావు హత్య కేసు సీఐడీకి బదిలీ

transfer | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డలో ఐదేళ్ల క్రితం జరిగిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కోట శ్రీహరి రావు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదేళ్లు గడిచినా నిందితుల అరెస్టు కానీ, చార్జిషీట్ కానీ దాఖలు కాకపోవడంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఈ నేపథ్యంలో వైసీపీ నేత గౌతమ్‌ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, కృష్ణా జిల్లా ఎస్పీకి కేసుపై సమగ్ర విచారణ జరపాలని గ‌తేడాది న‌వంబ‌ర్ 14న కోరారు.

కేసును తాజాగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ, కృష్ణా జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు అవనిగడ్డ సీఐ… సీఐడీ (సీఐడి), ఏపీ వారికి గ‌తేడాది డిసెంబ‌ర్ 8న బదిలీ చేశారని తెలుపుతూ దీనికి సంబంధించి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె. శ్రీనివాసరావు ద్వారా ఈరోజు అధికారిక (పీజీఆర్ఎస్) పత్రము గౌతమ్ కి అందజేయటం జరిగింది.

Leave a Reply