Sonia Gandhi | ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

Sonia Gandhi | ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

Sonia Gandhi | ఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాలు ఇవాళ వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు (Doctors) తెలిపారు. ఛాతీ సంబంధిత నిపుణుని నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఆమె అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని, ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు పిటిఐ వార్తా సంస్థకు తెలిపాయి. సోనియా గాంధీ గత కొంతకాలంగా దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.

Leave a Reply