Nandyala | ఎద్దుల బండిని ఢీకొట్టి..

Nandyala | ఎద్దుల బండిని ఢీకొట్టి..
- బైకిస్టులు ఇద్దరు మృతి
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్యాపిలి మండలం ఎస్.రంగాపురం గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్యాపిలి పోలీసులు తెలిపిన వివరాలను ఎస్. రంగాపురం గ్రామానికి చెందిన కె.సురేంద్ర రాజశేఖర్, వై.సురేంద్రలు డోన్ దగ్గర ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నారు. విధుల కోసం మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై ముగ్గురు బయలుదేరారు. మంచు ఎక్కువగా ఉండటంతో ముందున్న ఎద్దుల బండిని ఢీకొట్టారు. కె.సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్, వై.సురేంద్రను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రాజశేఖర్ మరణించాడు. సురేంద్రకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
