Chemical Bals | మద్రాస్ ఐఐటీ శిక్షణకు జన్నారం స్లేట్ విద్యార్థులు

Chemical Bals | మద్రాస్ ఐఐటీ శిక్షణకు జన్నారం స్లేట్ విద్యార్థులు

  • కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సాతి కార్యక్రమం..

Chemical Bals | జన్నారం, ఆంధ్రప్రభ : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఐఐటి కాన్పూర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న సాతి(ఎస్ఏటీహెచ్ఈఈ) కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రానికి చెందిన లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్(Late Group of Schools) కు చెందిన 10మంది ప్రతిభావంతులైన విద్యార్థులతో మార్గదర్శకుడైన ఉపాధ్యాయుడు కె. భీమ్రావు వెళ్లారు.

3 రోజుల శిక్షణలో భాగంగా ఈ రోజు సాయంత్రం మద్రాస్ లోని ఐఐటీని వారు సందర్శించారు. ఈ శిక్షణలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, యూఏవీ డ్రోన్స్, సివిల్ ఇంజనీరింగ్, లావా ల్యాంప్స్, కెమికల్ బాల్స్(Chemical Bals) శాస్త్రీయ ప్రయోగాలను చెన్నైలోని గజేంద్ర సర్కిల్లోని కేవీ గ్రౌండ్లో నిర్వహించిన శాస్త్ర సాంకేతిక ఎక్స్పోను, మద్రాస్ ఐఐటీని, భారత నౌకాదళం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ టెక్నాలజీని విద్యార్థులు సందర్శించి ఆధునిక సాంకేతిక నమూనాలను ఆ విద్యార్థులు ప్రత్యక్షంగా ఎంతో ఆసక్తిగా వీక్షించారు.

క్రయోజెనిక్, సీఎంఎస్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై నిపుణుల ద్వారా అవగాహన పొందారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులను ఆ విద్యాసంస్థల చైర్మన్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, వ్యవస్థాపకుడు ఏనుగు సుభాష్ రెడ్డి, డైరెక్టర్ ఏనుగు రజితరెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Leave a Reply