నంద్యాల బ్యూరో, మార్చి 4 : నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సీఐ రమేష్ తెలిపిన వివరాల మేరకు… బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈప్రమాదంలో పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జమ్మల మడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తాడిపత్రికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. సీఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆర్టీసీ బస్సులో సుమారు 25మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులను మరొక బస్సు ద్వారా ఆయా ప్రాంతాలకు తరలించారు.
ట్రాక్టర్, మరో వాహనం ఢీకొని… ఒకరు మృతి
కర్నూలు జిల్లా (డోన్) : డోన్ పట్టణ సమీపంలో జగనన్న కాలనీ దగ్గర ఇవాళ ఉదయం ట్రాక్టరు, మరో ఢీకొని ట్రాక్టర్ హమాలి మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆర్టీసీ బస్సు బోల్తా ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అరా…
నంద్యాల బ్యూరో : నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కల్వటాల దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటనలో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అధికారులను ఆదేశించారు. గాయాలపాలైన 20మంది క్షతగాత్రుల అరోగ్య పరిస్థితి పర్యవేక్షణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను అధికారులను ఆదేశించారు.