Anjaneyulu Goud | సీసీ రహదారులు నిర్మించాలని ఎంపీ డీకేఅరుణకు వినతి

Anjaneyulu Goud | సీసీ రహదారులు నిర్మించాలని ఎంపీ డీకేఅరుణకు వినతి
Anjaneyulu Goud | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో సీసీ రహదారులు నిర్మించాలని బిజ్వార్ నూతన సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య, మాజీ సర్పంచ్ తనయుడు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ నివాసంలో డీకే అరుణకు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం వారు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గ్రామంలో సీసీ రహదారులు, ఐమాక్స్ లైట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అందుకు ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో భాజపా వార్డు సభ్యులు, నేడగుం రాఘవేందర్, పోలీస్ చెన్న రెడ్డి, బారాసా వార్డు సభ్యుడు మల్లయొల్ల వెంకటేష్ గౌడ్ తోపాటు భాజపా సీనియర్ నాయకులు గుడిసె రాజప్ప, ఆంజనేయులు గౌడ్, అశోక్ గౌడ్, తులసీదాస్, కుక్కలి వెంకటప్ప, మహేష్ గౌడ్, వాకిటి పత్తి ఆంజనేయులు, ఎం.అశోక్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
