Corporation | విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Corporation | విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందించాలి
- ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యేలు
Corporation | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : విశ్వ బ్రాహ్మణుల అభ్యున్నతికి విశ్వ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్(Corporation) ఏర్పాటు చేయాలని రామగుండం, పెద్దపల్లి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయ రమణారావులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. శనివారం హైదరాబాదులో సీఎంను కలిసి స్వర్ణకారుల సమస్యలకు పరిష్కారం చూపాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా 50 ఏళ్లు పైబడిన విశ్వ బ్రాహ్మణులకు పెన్షన్ మంజూరు చేయాలని, అలాగే వివాహాలలో పుస్తే మట్టేలపై స్వర్ణకారులకే పూర్తి హక్కులు కల్పిస్తూ జ్యూవెలరీ షాపుల్లో అమ్మకాలను నిషేధించేలా ప్రత్యేక జీఓ జారీ చేయాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేలు తెలియజేశారు.
