Honor | కొత్త సర్పంచులకు స‌న్మానం…

Honor | కొత్త సర్పంచులకు స‌న్మానం…

Honor | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సన్మానం(honor) చేశారు. ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో నూతన సర్పంచుల పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మండలంలో నూతనంగా ఎంపికైన సర్పంచులను ఆత్మీయ సన్మానం(spiritual honor) నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పాటుపడాలని సూచించారు. మండల, గ్రామస్థాయి అధికారుల సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జావిద్ అలీ, పంచాయతీరాజ్ ఏఈ విక్రమ్, ఉపాధి హామీ ఏపీవో నర్సయ్య, సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply