Driving License | రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి…

Driving License | రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి…
Driving License | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు రోడ్డు భద్రత నియమాలలో భాగంగా భీమ్‌గల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీస్ భద్రత నియమాలపై సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 నుండి 31 వరకు జాతీయ రోడ్డు(National Road) భద్రత నియమాల పై ప్రత్యేక దృష్టి సారించిందని సీఐ పొన్నం సత్యనారాయణ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తప్పకుండా వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు. మైనర్ యువకులకు వాహనాలను తల్లిదండ్రులు కానీ బయట వారు కానీ ఇవ్వకూడదన్నారు. 18 సంవత్సరాలు పైబడి లైసెన్స్ కలిగి ఉన్న యువకులు యువతీలు వాహనాలు నడపవ్వాలని అన్నారు.
డ్రైవింగ్ లైసెన్స్(Driving License) రోడ్డు నియమాలు తెలియని వాహనదారులు వాహనాలు నడిపీయకూడదని సూచించారు. వాహనదారులు తప్పకుండా ఆర్సి, లైసెన్స్, ఇన్సూరెన్స్(Insurance) కలిగి ఉండాలని అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ ధరించలేని వారికి కూడా పువ్వునిచ్చి రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలన్నారు.
లేని పక్షంలో కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై సిహెచ్ తిరుపతి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లో రంజిత్ రెడ్డి, సాగర్, అంజుమన్ కమిటీ సభ్యులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
