Gudivada | ఆ తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తుంది

Gudivada | ఆ తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తుంది

  • గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

Gudivada | గుడివాడ – ఆంధ్రప్రభ : చేతకాని పాలనతో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సరి చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గత ప్రభుత్వం తప్పులతో ముద్రించిన పాస్ పుస్తకాల స్థానంలో…. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.

గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామంలో రీ సర్వే గ్రామసభ కార్యక్రమాన్ని ఇవాళ‌ ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి యజమాన్యపు హక్కు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… గత పాలకులు వ్యవస్థలను ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసన్నారు. ప్రజల ఆస్తులపై మహాత్మా గాంధీ మాదిరిగా జగన్ ఆయన ఫోటోలను ముద్రించుకొని, ప్రజాధనంతో పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు.

ఆస్తి మాది అనే భావన కలిగేలా యజమానుల ఫోటోలతో కూడిన పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయడం మంచి కార్యక్రమమ‌ని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులు ఎంతో ఆనందంగా తీసుకుంటున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు. ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే 25వేల పాసు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, నేటి నుండి ఈ నెల 9వ వరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే రాము చెప్పారు. రైతాంగం ఆనందపడేలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో బాలసుబ్రమణ్యం, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, లింగం ప్రసాద్, గొర్రపత్తి సుబ్బారావు, ఎమ్మార్వో కిరణ్ కుమార్, గ్రామ నాయకులు ఇస్తా శ్రీనివాసరావు, వీరవరపు ఏసుబాబు, అడుసుమిల్లి గోపాలకృష్ణ, అడుసుమిల్లి లక్ష్మణరావు, సురేష్, కోరుమిల్లి స్వామి, మదిరి సుబ్బారావు, కటారి రాంబాబు, ఇస్సా కృష్ణమూర్తి, బాజీ, కోటిలింగం, పలువురు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply