Kothagudem | కళాశాల బస్సు బోల్తా

Kothagudem | కళాశాల బస్సు బోల్తా

  • 60 మంది విద్యార్థులకు గాయాలు
  • బూర్గంపాడు మండలం భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద ఘటన

Kothagudem | భద్రాచలం, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద ఇవాళ‌ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్వంచలోని కేఎల్ఆర్ కళాశాలకు చెందిన బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 60మంది విద్యార్థినీ, విద్యార్థులకు గాయాలపాలయ్యాయి.

Kothagudem

ప్రమాద సమయంలో ఒక విద్యార్థిని బస్సులో ఇరుక్కుపోయినట్లు సమాచారం. కాగా ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రులకు ఇతర వాహనాల్లో తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Kothagudem
Kothagudem
Kothagudem

Leave a Reply