YouTuber Anvesh | అన్వేష్‌పై కేసు నమోదు

YouTuber Anvesh | అన్వేష్‌పై కేసు నమోదు
YouTuber Anvesh | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ (YouTuber Anvesh) పై పోలీసులు కేసు నమోదు చేశారు. నటి కరాటే కల్యాణి (Actress Karate Kalyani) ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై వివాదాస్పద కంటెంట్ ప్రచారం చేశాడనే ఆరోపణలతో కేసు నమోదైంది (case registered).
మరోవైపు ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ (Khanapuram Haveli Police Station) లో హిందూ దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని దానవాయిగూడెం వాసి జి. సత్యనారాయణరావు (G. Satyanarayana Rao) ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు. అన్వేష్ యూట్యూబ్ వీడియోల్లో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు రెండు కేసుల్లోనూ దర్యాప్తు చేపట్టారు.
మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ వ్యాఖ్యలతో పాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు (Garikapati Narasimha Rao) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అన్వేష్ వరుస వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హిందూ దేవతలను కించపర్చే విధంగా మాట్లాడటంతో అన్వేష్పా అటు హిందూ సంఘాలు, ఇటు నెటిజన్లు మండిపడుతున్నారు.
