Bar Association | స్టాండింగ్ కౌన్సిలింగ్ సభ్యులు ప్రభాకర్‌కు సన్మానం

Bar Association | స్టాండింగ్ కౌన్సిలింగ్ సభ్యులు ప్రభాకర్‌కు సన్మానం

Bar Association | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పనిచేస్తున్న సీనియర్ న్యాయవాది పెందూర్ ప్రభాకర్ కు సెంట్రల్ గవర్నమెంట్(Central Government) ఆడిషన్ స్టాండింగ్ కౌన్సిలింగ్ సభ్యులుగా నియమించడంతో ఈ రోజు ఉట్నూర్ కోర్టు బార్‌ అసోసియేషన్(Bar Association) ఆధ్వర్యంలో న్యాయవాదులు న్యాయవాది ప్రభాకర్‌కు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ పెందూర్ ప్రభాకర్ వృత్తి రీత్యా సంపూర్ణ న్యాయ సేవలు అందించి న్యాయశాఖలో ఇంకా ఎన్నెన్నో పదవులు పొందుతూ గుర్తింపు పొందాలని సీనియర్ న్యాయవాదులు(Lawyers) కోరారు. ఈ కార్యక్రమంలో బార్అసోసియేషన్ అధ్యక్షుడు బాపురెడ్డి, ఉపాధ్యక్షుడు బానోత్ జగన్ నాయక్, ప్రధాన కార్యదర్శి బి. జైవంత్ రావు,కోశాధికారి శ్రీనివాస్, న్యాయవాదులు జమీర్ ఖాన్,చింతల గిరి, పవార్ వసంత్ రావు, కుడెల్లి అశోక్,పంజాల చంద్రమౌళి, నాతరి రాజు, విశాల్ జాదవ్, మానల లక్ష్మీనారాయణ, దుర్వ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply