Nizampet | ఉచిత మెగా వైద్య శిబిరం

Nizampet | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని తిప్పనగుల్ల, షాకత్ పల్లి గ్రామాల్లో ఇవాళ‌ కాంగ్రెస్ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి ఉచితంగా మందులను అందించారు.

ఈసందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… డాక్టర్ మోహన్ నాయక్, ఉచిత మెగా వైద్య శిబిరాలే కాకుండా నిరుపేద కుటుంబాల వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వధువు వివాహాలకు పుస్తెమట్టెలను అందిస్తూ అండగా నిలుస్తున్న డాక్టర్ మోహన్ నాయక్ కు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంగినపల్లి మంజుల, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply