Freezer Box | సర్పంచ్ ఎన్నికల్లో ఓడినా..

Freezer Box | సర్పంచ్ ఎన్నికల్లో ఓడినా..

  • కాంగ్రెస్ నేత నాయకాడు లింగప్ప ఔదార్యం
  • రూ.65 వేల సొంత ఖ‌ర్చుతో గ్రామానికి ఫ్రీజర్ బాక్స్ అందజేత

Freezer Box | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మండలంలోని కాట్రేవ్‌పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నాయకాడు చిన్నలింగప్ప ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ గా పోటీచేసి ఓడిపోయారు. అయినా ఇచ్చిన మాట ప్రకారం త‌న సొంత ఖ‌ర్చుతో రూ.65 వేలు వెచ్చించి ఫ్రీజర్ బాక్స్‌ను గ్రామపంచాయతీకి అందజేశాడు.

రాబోయే రోజుల్లో గ్రామంలో తాగునీటి ఇబ్బందులను సైతం దూరం చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చిన్నలింగప్ప తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయ‌న‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.‌ కార్యక్రమంలో నాయకాడు నరసప్ప, గడ్డం నర్సప్ప, ఎండి రసూల్, దాసరి చెన్నప్ప, నాయకాడు లింగప్ప, చిన్న కిష్టప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply