18th All India | సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం

18th All India | సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం

  • సీఐటీయూ జిల్లా ఉపాధ్య‌క్షులు రామాంజ‌నేయులు

18th All India | రాప్తాడు, ఆంధ్రప్రభ : విశాఖలో డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు సీఐటీయూ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధ్యక్షుడు మన్నీల రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ రోజు రాప్తాడు పంగల్ రోడ్డు నుంచి మండల కేంద్రం వరకు బైకు యాత్ర(Bike trip) నిర్వహిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమం చేపట్టారు.

జిల్లా ఉపాధ్యక్షులు మన్నీల రామాంజనేయులు మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) 18వ అఖిల భారత(18th All India) మహాసభలు ఆంధ్రప్రదేవ్‌లో నిర్వహించడం మన రాష్ట్రానికే గర్వ కారణమ‌ని అన్నారు. స్వాతంత్రోద్యమ వారసత్వంలో పుట్టి కార్మికవర్గ ఆశయానికి అంకితమైన సంస్థ సీఐటీయూ అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రధాన కేంద్రమైన విశాఖ ఈ మహాసభలకు వేదిక కానుందని అన్నారు. దేశం నలుమూలల నుంచి కాకలు తీరిన కార్మిక నాయకులు కొలువు దీరనున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పుష్పరాజ్ హమాలీలు లక్ష్మన్న మధు మల్లేష్ నారాయణస్వామి చెన్నప్ప ప్రకాష్ అజయ్ రాజేష్ పోతలయ్య నాగేంద్ర నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply