MLA Palle Sindhura Reddy | ఉచిత గ్యాస్ పంపిణీ..

MLA Palle Sindhura Reddy | ఉచిత గ్యాస్ పంపిణీ..
MLA Palle Sindhura Reddy | అమడగూరు, ఆంధ్రప్రభ : ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చౌడేశ్వరీ దేవి కల్యాణ మండపంలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తెలుగు యువత నాయకులు శ్యామ్ బాబు ఆధ్వర్యంలో ఉచిత కనెక్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పల్లె సింధురా రెడ్డి హాజరయ్యారు. మహిళలకు ఉచితంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ అసోసియేషన్ అధ్యక్షులు రాజీవ్, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వల్లెపు సోమశేఖర్, బీజేపీ నాయకులు చింత శరత్ కుమార్ రెడ్డి, ఎస్టీ సెల్ నాయకులు శ్రీనివాస్ నాయక్, టీడీపీ సీనియర్ నాయకులు రాజారెడ్డి, సురేంద్ర, రామచంద్ర రెడ్డి, క్రిష్ణ రెడ్డి, జయచంద్ర, కుమార్ రెడ్డి, శంకర్ నాయుడు, తుమ్మిలి రెడ్డి, ఆదినారాయణ, నంజి రెడ్డి, వడ్డెర సంఘం మండల అధ్యక్షులు దొనకొండ రమణప్ప, మంజుల లక్ష్మన్న, కిష్టప్ప, డీలర్లు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
