Two young women | ఉన్న‌త విద్య కోసం వెళ్లి… అనంత‌లోకాల‌కు!

Two young women | ఉన్న‌త విద్య కోసం వెళ్లి… అనంత‌లోకాల‌కు!

  • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు దుర్మ‌ర‌ణం

Two young women | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఉన్న‌త విద్య కోసం వెళ్లిన తెలంగాణ‌కు చెందిన ఓ ఇద్ద‌రు యువ‌తులు రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాలైన సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది. అమెరికాలోని (America) కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. గార్ల మండల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె మేఘన, ముల్కనూర్ గ్రామ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె భావన ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన ఈ ఇద్దరు యువతులు రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Two young women

CLICK HERE TO READ ఏటీఎం మిషన్లే వీరి టార్గెట్…

CLICK HERE TO READ MORE

Leave a Reply