Dead | రిటైర్మెంట్ కు నాలుగు రోజుల ముందు..

Dead | రిటైర్మెంట్ కు నాలుగు రోజుల ముందు..
- హెచ్ఎం గట్ల నరసయ్య మృతి
Dead | కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గట్ల నరసయ్య (61) ఇవాళ తెల్లవారుజామున మృతిచెందారు. గట్ల నరసయ్య గత కొన్ని నెలలుగా లెన్స్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఇటీవల వ్యాధి ఎక్కువ కావడంతో హైదరాబాద్ వెళ్లి వైద్య చికిత్స చేయించుకొని రావడం జరిగింది. కాగా ఇవాళ తెల్లవారు జామున మృతి చెందినట్లు అతని కుటుంబం సభ్యులు తెలిపారు.
అయితే మృతుడు నరసయ్య ఈనెల 31వ తేదీన పదవీ విరమణ కావలసి ఉండగా, నాలుగు రోజుల ముందే నరసయ్య మృతిచెందడం వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నరసయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అందరితో కలిసి మెలిసి ఉండే నరసయ్య ఆకస్మికంగా మృతిచెందడంతో తోటి ఉపాధ్యాయులు, లింగాపూర్ గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, పోషకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కడెం ఎంఈఓ షేక్ హుస్సేన్, లింగాపూర్ జెడ్ పి ఎస్ ఎస్ హెచ్ఎం బి.వెంకటరమణ, మాజీ జెడ్పిటిసి పి.శ్రీనివాసరెడ్డి, లింగాపూర్ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్, ఉప సర్పంచ్ కమ్మల లక్ష్మి, పాండవ పూర్ పిఎసిఎస్ డైరెక్టర్లు పి రాజేశ్వర్ రెడ్డి, జి మల్లేష్, లింగాపూర్ మాజీ సర్పంచ్ ఆకుల బాలవ్వ లచ్చన్న, న్యాయవాది నేదురి జాకబ్, పి ఆర్ టి యు కడెం మండల అధ్యక్షులు బి వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి బి మహేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు కూచనపల్లి శ్రీనివాస్ తోపాటు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు నరసయ్య కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
