BC | సంఘాల ఆందోళన..

BC | సంఘాల ఆందోళన..

  • పిల్లి రామరాజు యాదవ్ పై దాడికి నిర‌స‌న‌
  • బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఫ్లెక్సీ దగ్ధం

BC | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ పై ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లో బీసీ సంఘాలు, యాదవ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు స్థానంలో ఉండి పార్టీ నాయకుడి పైనే దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. నాగం వర్షిత్ రెడ్డి వెంటనే పిల్లి రామరాజు యాదవ్‌కు, యాదవ సమాజానికి క్షమాపణలు చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నాగం వర్షిత్ రెడ్డి ఫ్లెక్సీని దగ్ధం చేశారు.

ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కుల అహంకారంతో బీసీ వర్గాలకు చెందిన నాయకుడిని అవమానించారని నాగం వర్షిత్ రెడ్డి ని వెంటనే జిల్లా అధ్యక్ష పదవి నుండి తొలగించాలని యాదవ్ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ డిమాండ్ చేశారు.

Leave a Reply