Vajpayee | వాజ్‌పేయికి నివాళి

Vajpayee | వాజ్‌పేయికి నివాళి
- చిట్యాల మండలంలో ఘనంగా జయంతి వేడుకలు
Vajpayee | చిట్యాల, ఆంధ్రప్రభ : భారత మాజీ ప్రధానమంత్రి, అజాతశత్రువు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలను చిట్యాల, సుంకేనపల్లి, గుండ్రంపల్లి, పెద్దకాపర్తి, నేరడ గ్రామాలలో ఈ రోజు బీజేపీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న, పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
బీజేపీ నాయకులు మాట్లాడుతూ. అటల్ జీ భారత రాజకీయాల్లో ధ్రువతార అని కొనియాడారు. “దేశం కోసం జీవించి, దేశం కోసం ఆలోచించిన మహనీయుడు వాజపేయి. ఆయన హయాంలో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం, గ్రామీణ రోడ్ల అభివృద్ధి దేశ గమనాన్ని మార్చాయని” అని కొనియాడారు.

