BJP | వాజ్ పేయి జయంతి వేడుకలు..
BJP, కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు ప్రధాన సెంటర్లో బీజేపీ కోడూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఆధునిక భారత నిర్మాత, దర్శనికుడు, రాజనీతిజ్ఞుడు, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు పాల్గొని వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండలం జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

