Mangapeta | చిన్నారిని ఆశీర్వదించిన మంత్రి సీతక్క

Mangapeta | చిన్నారిని ఆశీర్వదించిన మంత్రి సీతక్క
Mangapeta | మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట మండలంలోని చుంచుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ బొచ్చు వెంకన్న- సమతల దంపతుల కుమార్తె విజేతను ఇవాళ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆశీర్వదించారు.
బొచ్చు వెంకన్న- సమతల దంపతుల కుమార్తె విజేత నూతన్ వస్త్ర అలంకరణ కార్యక్రమం చుంచుపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) హాజరై చిన్నారిని ఆశీర్వదించి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగా కళ్యాణి, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా, నియోజకవర్గ, బ్లాక్ కాంగ్రెస్, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
