Chennaraopeta | ఎమ్మెల్యే సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతా

Chennaraopeta | ఎమ్మెల్యే సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతా
- బోడ మాణిక్యం తండా గ్రామ సర్పంచ్ భూక్య ఉమమోహన్ నాయక్
Chennaraopeta | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో బోడ మాణిక్యం తండా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని గ్రామ సర్పంచ్ భూక్య ఉమమోహన్ నాయక్ అన్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన ఆమె ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ… గత ఎన్నికల్లో తన భర్త స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినా ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం పని చేశామన్నారు.
తండా వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు సిద్దన రమేష్, అధికారుల సహకారంతో పరిష్కరించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. తమపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు పాలకవర్గం పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్ దంపతులను శాలువా కప్పి సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
