Narayanpeta | ఘనంగా గణిత దినోత్సవం

Narayanpeta | ఘనంగా గణిత దినోత్సవం

Narayanpeta | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్దుంపూర్ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఇవాళ‌ ఘనంగా జరుపుకున్నారు. రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఆయన‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు శివరాజ్ మాట్లాడుతూ… శ్రీనివాస్ రామానుజన్ గణితానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. శ్రీనివాస్ రామానుజన్ సంఖ్య 1729 సంఖ్య ప్రత్యకను వివరించారు. 15 ఏళ్లకే రామానుజన్ తనలోని తెలివితేటలను ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మహేష్, నర్మద, అపర్ణప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply