Ootkur | అట్టహాసంగా ప్రమాణ స్వీకారం…

Ootkur | అట్టహాసంగా ప్రమాణ స్వీకారం…

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో మూడో విడ‌త‌ ఎన్నికల్లో గెలుపొందిన 23 మంది సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా, కోలాహాలంగా కొనసాగింది. గెలుపొందిన ప్రజా ప్రతినిధులు(Public representatives) డప్పు మేళా తాళాలతో భారీ ఊరేగింపుగా పంచాయతీ కార్యాలయాలకు చేరుకోగా ఆయా అధికారులు ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించి ప్రమాణస్వీకారం చేయించారు.

ఊట్కూర్ మండలంలో ఏకగ్రీవంగా మూడు సర్పంచ్ స్థానాలు, సర్పంచులు రాములు, మోహన్ నాయక్, జయమ్మతోపాటు ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఊట్కూర్ సర్పంచ్ గా ఎం. రేణుక భరత్, ఉప సర్పంచ్ గా ఆర్.రమేష్ తో పాటు వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

సమస్తాపూర్ సర్పంచ్ గా జయప్రకాశ్ రెడ్డి, లక్ష్మీ పల్లి సర్పంచుగా రేణుక, కొత్తపల్లి సర్పంచుగా నరసింహ, మొగుధంపూర్ సర్పంచ్ గా తిరుమలేష్(Tirumalesh), నాగిరెడ్డిపల్లి సర్పంచ్ గా కుమ్మరిబస్వరాజ్, పగిడిమర్రి సర్పంచ్ గా ఎండి జాఫర్ ప్ర‌మాణ స్వీకారం చేశారు.

అమీన్పూర్ సర్పంచ్ టప్ప నాగేష్, ఓబులాపూర్ సర్పంచ్ గా సత్యనారాయణ రెడ్డి, తిప్రాసు పల్లి సర్పంచ్ గా విజయలక్ష్మి, బిజ్వార్ సర్పంచ్ గా కొల్లంపల్లి అంజయ్య, కొల్లూరు సర్పంచ్ గా సింగారం సువర్ణ, చిన్నపోర్ల సర్పంచుగా గాండ్ల నికిత అవసరలోని పల్లి సర్పంచుగా దాసరి ఎల్లమ్మ, ఎడవెల్లి సర్పంచ్ గా ఆంజనేయులు, పెద్దపోర్ల సర్పంచ్ గా బోయిన్పల్లి కాశమ్మ, మల్లేపల్లిసర్పంచ్ గా కథలప్ప, పెద్ద జట్రం సర్పంచ్ గా వాకిటి వెంకటేష్, పులిమామిడి సర్పంచ్ గా కె. త్రివేణి తో పాటు ఆయా గ్రామాల ఉపసర్పంచులు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో కిషోర్ కుమార్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply