Narsinghi | ఘన సన్మానం

Narsinghi | ఘన సన్మానం
Narsinghi | నార్సింగి, ఆంధ్రప్రభ : నార్సింగి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఆకల సుజాత మల్లేష్ గౌడ్‌ను పాస్టర్ రూబెన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాభివృద్ధి, ప్రజాసేవలో సర్పంచ్ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అభిమానులు పాల్గొన్నారు.
