Students | ప్రత్యేక అభినందనలు..

Students | ప్రత్యేక అభినందనలు..

Students | నందివాడ, ఆంధ్రప్రభ : నందివాడ మండలం వెన్ననపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి కెరీర్ ఎకో ఎగ్జిబిషన్లో సత్తా చాటారు. తమ సృజనాత్మకతతో ఆకట్టుకుని ద్వితీయ బహుమతి సాధించారు. ఈ విషయాన్ని హెచ్ఎం ఎన్.వై. మాధవ్ కుమార్ తెలియచేసి హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన కొనియాడారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.

Leave a Reply