Parliamentary | అధ్యక్ష పదవి తారుమారు..

Parliamentary | అధ్యక్ష పదవి తారుమారు..
- మారిన సామాజిక సమీకరణాలు
- మొన్నతాతిరెడ్డి తులసి రెడ్డి.. నిన్న మన్నె సుబ్బారెడ్డి తప్పించారు
- గౌరు చరిత రెడ్డిని ప్రకటించిన అధిష్టానం
- ఊహించని వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి
- టీడీపీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల ప్రకటన
Parliamentary | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 25 లోకసభ నియోజకవర్గాలకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ఆదివారం ప్రకటించారు. ఈ నియామకాల్లో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ.. అధ్యక్ష పదవుల్లో బీసీలకు 8, మైనార్టీలకు 1, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, ఓసీలకు 11 స్థానాలు కేటాయించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. నంద్యాల జిల్లాలో అధ్యక్ష పదవి పలు మలుపులు తిరిగింది. టీడీపీ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్ష పదవికి మొదటిగా ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసి రెడ్డి పేరును ప్రకటించారు. అనంతరం విత్తన సంస్థ రాష్ట్ర చైర్మన్ మన్నె సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు. ముచ్చటగా అధిష్టానం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించడం విశేషం. జిల్లా అధ్యక్ష పదవికి గౌరు చరిత రెడ్డి పేరును ప్రకటించగా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ ను ప్రకటించారు.
త్రీ మెన్ కమిటీ నివేదికను కాదని కొత్త వ్యక్తిని తెరపైకి తేవటం జిల్లాలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఊహించని విధంగా పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి నంద్యాల జిల్లా అధ్యక్ష పదవి దక్కటం విశేషం. గౌరు చరితారెడ్డి పాణ్యం నియోజకవర్గంలో నుంచి రెండుసార్లుగా గెలిచింది. మొదటిసారిగా వైసీపీ నుంచి గెలిచింది. వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. గౌరు చరిత రెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డి. ఈమె స్వగ్రామం నందికొట్కూరు నియోజకవర్గంలోని కొణిదల గ్రామానికి చెందిన మహిళ. మొదటి నుంచి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న గ్రామం. గౌరు చరిత రెడ్డి 1971 ఆగస్టు 4వ తేదీన జన్మించారు. ఈమె 2019లో టీడీపీలో చేరారు. వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. గతంలో నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 2004వ సంవత్సరంలో శాసనసభ ఎన్నికల్లో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు.

2014లో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తీరాలి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేట్ అయ్యారు. 2014 సంవత్సరం శాసనసభ ఎన్నికల్లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తమ సమీప ప్రత్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఓడించి ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ నిరాకరించటంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల్లో ఆమె ఓడిపోయింది. తిరిగి 2020 నాలుగో సంవత్సరంలో ఆమె పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేసి ఘనవిజయం సాధించింది.
ఆమె ప్రత్యెత్తి కాటసాని రాంభూపాల్ రెడ్డి పై 40 వేల కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో విజయం సాధించటం విశేషం. ఆమె పందెం నియోజకవర్గంలోని కార్యకర్తలకు అండగా ఉండటం విశేషం. పాణ్యం నియోజకవర్గంలోని గోరుకల్లు అలగనూరు రిజర్వాయర్లకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి వాటికి మరమ్మత్తులకు నిధులు మంజూరుకు కృషిచేసి ఆ ప్రాంత వాసుల అభిమానాన్ని చూరగొన్నది. పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం గడివేముల మండలాలు నంద్యాల జిల్లాలో ఉండగా ఓర్వకల్లు కల్లూరు మండలాలు కర్నూల్ జిల్లాలో ఉండటం విశేషం. ఈ ప్రాంత అభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది.

- ముళ్ళ కిరీటాన్ని జయించేనా?
నంద్యాల జిల్లాలో ఉమ్మడి కూటమి ప్రభుత్వములో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. గతంలో ఉన్న టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ కూడా గౌడు చరిత వర్గానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ తో కూడా సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఎంపీ వర్గానికి గౌరు చరిత వర్గానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. నందికొట్కూరు పాణ్యం నియోజకవర్గాలలో ఇరువర్గాలు పోటాపోటీగా ఉన్నారు. ఆధిపత్య పోరు సంఘటనలు కూడా గతంలో జరిగాయి. పాణ్యం నియోజకవర్గంలో బైరెడ్డి వర్గానికి చెందిన ఒక వ్యక్తిని కొట్టిన సంఘటనలు కూడా జరిగాయి. మరి ఎంపీ వర్గానికి ప్రజలకు ఎలా సహకరిస్తుందో జిల్లా టిడిపి అధ్యక్షురాలుగా ఎన్నికైన గౌరు చరిత రెడ్డి ఎలా వెళ్తుందో వేచి చూడాల్సిందే.
రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె సుబ్బారెడ్డి పదవి ఖాయమన్న నేపథ్యంలో అనూహ్యంగా తప్పించటం విశేషం. ఎన్నికల ముందు వరకు డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీకి సుబ్బారెడ్డి పేరు గణనీయంగా వినిపించింది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కేఈ కృష్ణమూర్తి వర్గాలు కలిసిపోవటం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయటం గెలుపొందటం జరిగింది. ఈ ఎన్నికలలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి గెలుపులకు సుబ్బారెడ్డి పూర్తిగా సహకారం అందించాడు. అందుకు అధిష్టానం కూడా ఆయనకు రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఎంపిక చేశారు. జిల్లాకు మొదటిగా ఎంపికైన తాతి రెడ్డి తులసి రెడ్డి పేరును కూడా అనూహ్యంగా తప్పించారు.
- జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎండీ ఫిరోజ్
నంద్యాల జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రాన్ని మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తనయుడు ఫిరోజ్ ను అధిష్టానం ఎంపిక చేసింది. పార్టీ అధికారంలో నేనెప్పటికీ కూడా ఈ పదవిలోనే కొనసాగటం విశేషం.ఇప్పటికీ మూడోసారిగా ఈ పదవిలో హ్యాట్రిక్ సాధించటం కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య కార్యకర్తలకు అండగా ఉంటూ టిడిపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు.
