DSP | బెల్ట్ షాపులను అరికట్టాలి..

DSP | బెల్ట్ షాపులను అరికట్టాలి..

  • ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
  • డీఎస్పీ ధీరజ్ వినీల్
  • పామ‌ర్రు పోలీస్ స్టేషన్ త‌నిఖీ

DSP | పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ (DSP) ధీరజ్ వినీల్ శుక్రవారం ఆక‌స్మికంగా సంద‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సాధారణ తనిఖీలో భాగంగా పామర్రు పోలీస్ స్టేషన్‌ను సందర్శించామని తెలిపారు. క్రైమ్ రేట్ డివిజన్ పరిధిలో అదుపులోకి వచ్చింద‌ని, అన్ని రికార్డులు పరిశీలించామని, పోలీసు బీట్లను పెంచే విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. పామర్రు సర్కిల్ పరిధిలో బెల్ట్ షాపులను అరికట్టే దిశగా చూస్తున్నామని డీఎస్పీ స్పష్టం చేశారు. అలాగే హైవేపై బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేక ప్రమాద సూచికలు పెట్టామని, ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐ శుభాకర్, ఎస్సైలు రాజేంద్రప్రసాద్, శిరీష, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply