- రోడ్డు, డ్రైనేజీ పైనే జనరేటర్లు..
- సెల్లార్లు పార్కింగ్ చేయాల్సిన వాహనాలు రోడ్డుపైనే…
- ఖలీల్ వాడిలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడి ప్రాంతంలో రోడ్డు, డ్రైనేజీలపై ప్రైవేట్ ఆస్పత్రుల జనరేటర్లను ఏర్పాటు చేసి దర్జాగా కబ్జా చేసిన దృశ్యాలను ఆంధ్రప్రభ కెమెరా క్లిక్ మనిపించింది. నగరంలోని ఖలీల్ వాడి ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రైవేట్ ఆసుపత్రుల ఆగ డాలు అన్ని ఇన్నీ కావు.. నిబంధనలన్నీ తుంగలో తొక్కుతారు. సెల్లార్లలో ఆసుపత్రి కార్యకలాపాలు నిర్వహిస్తారు. దీంతో రోడ్డుపైనే వాహనాల పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
ఇంత జరుగుతున్నా ట్రాఫిక్ నియంత్రణపై ట్రాఫిక్ పోలీసులు, అటు రోడ్డుని దర్జాగా కబ్జా చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రుల ఆగడాలపై కార్పోరేషన్ దృష్టి సారించకపోవడం వెనుక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా బల్దియా వెంటనే స్పందించి నిబంధనలు పాటించని ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.
