UP PEOPLE | గుర్తుతెలియని వాహనం ఢీకొని…
- ఇద్దరు యూపి వాసుల దుర్మరణ
UP PEOPLE | మక్తల్, ఆంధ్రప్రభ : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యూపీ వాసుల (Up People) దుర్మరణం చెందిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి… జాతీయ రహదారి 167 పై మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇద్దరు యువకులు ఆటోలో వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో యూపీకి చెందిన ఒకరు నీరజ్ గా ఆధార్ కార్డు ఆధారంగా నిర్ధారించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. ప్రమాదానికి గురైన ఆటో మక్తల్ పట్టణానికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆటోను ఢీకొన్న వాహనం వెళ్ళిపోయింది.

