36 times | ఆపదలో మానవత్వం చాటుకున్న బొడ్డు కిరణ్

36 times | ఆపదలో మానవత్వం చాటుకున్న బొడ్డు కిరణ్
36 times | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన కావ్య శ్రీకి అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరం ఉండగా ఆపదలోకి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు కిరణ్ ఈ రోజు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు.
కావ్య శ్రీ రక్తహీనతతో బాధపడుతూ ఉట్నూర్ ప్రభుత్వ హాస్పిటల్(Government Hospital)లో చేరడంతో కావ్య శ్రీకి అత్యవసరంగా రక్తం అవసరం ఉందని డాక్టర్లు బొడ్డు కిరణ్ దృష్టికి తేవడంతో మానవ దృక్పథంతో వెంటనే ఆయన స్పందించి ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి రక్తదానం చేశారు. బొడ్డు కిరణ్ ఇప్పటి వరకు పలు సందర్భాలలో 36 సార్లు(36 times) రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు.
ఈ సందర్భంగా బొడ్డు కిరణ్ ను డాక్టర్లతోపాటు హాస్పటల్ సిబ్బంది అభినందించారు. ఆపదలో ఉన్న వారికి అత్యవసర పరిస్థితుల్లో తాను రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని బొడ్డు కిరణ్ తెలిపారు.
