Telangana State | బీఆర్ ఎస్‌లో చేరికలు…
Telangana State | కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కడం పెద్దూర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా గెలుపొందిన డీ. కొండ విజయకుమార్( స్వతంత్ర) బీఆర్ ఎస్ పార్టీలో చేరికయ్యారు.
ఈ రోజు హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర(Telangana State) సమితి కార్యాలయంలో ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పెద్దూరు కడం జిపి సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానిచారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఏం రాజేశ్వర్ గౌడ్, కడెం మండల అధ్యక్షుడు నల్ల జీవన్ రెడ్డి, లింగాపూర్, దిల్దార్ నగర్ గ్రామాల సర్పంచులు కుమ్మరి రంజిత్, మాజీ మండల కో ఆప్షన్ నెంబర్ షేక్ అహ్మద్, కుమార్ బద్దనపల్లి స్టీఫెన్ మాజీ ఖానాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్(Committee Director) కాశ వేణి విజయ్ యాదవ్, మండల నాయకులు ముబారక్ ఇస్లావత్, గంగన్న, సపవట్ రవి, జీల నాగరాజు, సమ్మెట రాజన్న, గట్ల రమేష్, ప్రేమ్ కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

