Development | గ్రామ అభివృద్ధి కోసం ఓటు వేయండి

Development | గ్రామ అభివృద్ధి కోసం ఓటు వేయండి

Development | ధర్మపురి, ఆంధ్రప్రభ : తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలు ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థి వావిలల మమత జగదీష్ ఓటర్లను కోరారు.

ఈ రోజు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామానికి అత్యధికంగా నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసి మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజలు ఓటును సద్వినియోగం చేసుకోవాలని గెలిచే వారికే ఓటు వేసి గెలిపించాలని ఓటు వృధా చేసుకోవద్దని ఆమె కోరారు.

Leave a Reply