Co-operative | కో-ఆపరేటివ్ సొసైటీ సందర్శన…

Co-operative | కో-ఆపరేటివ్ సొసైటీ సందర్శన…
- మహిళ కో-ఆపరేటివ్ డైరీని సందర్శించిన వాగ్దేవి కళాశాల విద్యార్థులు
Co-operative | ఖిలావరంగల్, ఆంధ్రప్రభ : నగరంలోని బొల్లికుంట వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల(College of Engineering) ఎంబీఏ విద్యార్థులు విస్తృత సమూహం తమ విద్యా ప్రయాణంలో భాగంగా ఇవాళ హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం, ముల్కనూర్ కో-ఆపరేటివ్ సొసైటీ, మహిళ కో-ఆపరేటివ్ డైరీని సందర్శించారు. ఈ పర్యటన విద్యార్థులకు సహకార సంస్థల నిర్వహణ, వ్యవసాయం, డైరీ పరిశ్రమలపై అవగాహన పెంచడం కోసం ఏర్పాటు చేయబడింది.
ముల్కనూర్ కో-ఆపరేటివ్ సొసైటీ పరిపాలకుల సంస్థ, స్థాపన, అభివృద్ధి, వ్యవసాయ మద్దతు, ఆర్థిక ఫలితాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల ముల్కనూర్ కో-ఆపరేటివ్(Co-operative) డైరీని కూడా సందర్శించారు. అక్కడ విద్యార్థులు మహిళల ఆధ్వర్యంలో సాగుతున్న డైరీ ఉత్పత్తి, పాల సేకరణ, మార్కెటింగ్ విధానాలను తెలుసుకున్నారు.
మహిళలు ఆత్మనిర్బరంగా వ్యవహరిస్తూ ఈ రంగంలో విజయాలను సాదించడాన్ని విద్యార్థులు ప్రశంసించారు. ఈ పర్యటన విద్యార్థులలో సహకార సంస్థల వ్యాపార నిర్వహణ సామాజిక బాధ్యతలు, వ్యాపార అభివృద్ధిపై సమగ్ర అవగాహన పెంచినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్(Principal) డాక్టర్ కె ప్రకాష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి తిరుపతిరావు, హెచ్ఓడి డాక్టర్ వై భాస్కరరావులు ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రశంసించారు. ఈ పర్యటనలో కో-ఆర్డినేటర్ డాక్టర్ కేసి రెడ్డి వేణు, ఉపాధ్యాయ బృందం డాక్టర్ వి రాంచందర్ రావు, ఎస్ శైలజ, ఎస్ కళ్యాణ్ పాల్గొన్నారు.
