Rs. 50,000/- | మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Rs. 50,000/- | మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
Rs. 50,000/- | మునుగోడు, ఆంధ్రప్రభ : తెలంగాణ తొలి విడత ఎన్నికలలో నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన చెన్నగోని కాటమరాజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆదివారం గుండెపోటు(heart attack)తో మరణించారు. ఈరోజు ఓబీసీ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బూడిద లింగయ్య యాదవ్ వారి మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు.
అంతిమ యాత్రలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన వంతు సహాయంగా రూ.50,000/- లు(Rs. 50,000/-) అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇప్పర్తి గ్రామ నూతన సర్పంచ్ చీమల రాజు యాదవ్, ఆవుల శ్రీనివాస్ యాదవ్, బొజ్జ శ్రీనివాస్, కిష్టాపురం మాజీ ఉపసర్పంచ్ ఆకుల అనిల్, ఆకుల లింగస్వామి, బాకీ శ్రీకాంత్, అంతటి అంజయ్య గౌడ్, రేవల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
