Koyyur | అందుబాటులో ఉండి ప్రజాసేవే ధ్యేయం…

Koyyur | అందుబాటులో ఉండి ప్రజాసేవే ధ్యేయం…

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయడమే నా లక్ష్యం…

Koyyur | మల్హర్, ఆంధ్రప్రభ : మండలంలోని కొయ్యూరులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కొయ్యూరు సర్పంచ్ అభ్యర్థిగా కొండ రాజమ్మను సర్పంచ్ బరిలో ఉంచిన మంత్రి శ్రీధర్ బాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం నుండి ప్రజలకు అందజేసే పథకాలు కొయ్యూరు గ్రామపంచాయతీకి అందేలా అహర్నిశలు కృషి చేస్తాన‌న్నారు. మాజీ జెడ్పీటీసీ కోమల రాజిరెడ్డి వాడవాడ‌న తిరుగుతూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యమని ఇంటింట ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి కొండ రాజమ్మ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. సోదరీ సోదరీమణులారా ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించి ఆదుకొని మీ సేవకురాలుగా సోదరీలా పని చేస్తాన‌ని వారు ప్రజలతో అన్నారు. బుధవారం జరిగే స్థానిక ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.

Leave a Reply