Champions Trophy | పాక్ ని నిండా ముంచిన వ‌ర్షం !

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆతిథ్య పాక్ ఆశలపై వరుణుడునీళ్లు జల్లాడు. ఈరోజు (గురువారం) రావల్పిండి వేదికగా పాకిస్థాన్ – బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ఇరు జట్ల‌కు ఒక్కో పాయింట్ లభించింది. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్థాన్-బంగ్లాదేశ్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

అయితే, డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ ఒక్క విజయం కూడా సాధించకుండానే తమ ప్రస్థానాన్ని ముగించింది. 29 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్.. దారుణమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. గ్రూప్-ఏలో ఉన్న పాకిస్థాన్ పాయింట్ల ప‌ట్టిక‌లో అట్టడుగు స్థానంలో నిలవడం గమనార్హం. ఇక‌ గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *